ఎందుకీ వెదుకులాట ?
ఉన్నాయ్ కదా దుప్పట్లు
మంచితనం , మర్యాదలు, తెలివి తేటలు
కప్పేసేయ్ !
నీ స్వార్థపు వికృతపు ముఖాన్ని
నిండుగా , పూర్తిగా
కప్పేసేయ్ !
నీ ముఖం , నీ అసలు ముఖం
నీ పక్కవాడికి, నీకూ
కనిపెంచేలోగా
కప్పేసేయ్ !
అయినా ఎవరు చూడలేదులే , ఎందుకీ గోల ?
దుప్పట్లో, చీకట్లో,
భయంగా, హాయిగా,
ఉండిపో !
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment