ఎందుకీ వెదుకులాట ?
ఉన్నాయ్ కదా దుప్పట్లు
మంచితనం , మర్యాదలు, తెలివి తేటలు
కప్పేసేయ్ !
నీ స్వార్థపు వికృతపు ముఖాన్ని
నిండుగా , పూర్తిగా
కప్పేసేయ్ !
నీ ముఖం , నీ అసలు ముఖం
నీ పక్కవాడికి, నీకూ
కనిపెంచేలోగా
కప్పేసేయ్ !
అయినా ఎవరు చూడలేదులే , ఎందుకీ గోల ?
దుప్పట్లో, చీకట్లో,
భయంగా, హాయిగా,
ఉండిపో !
Monday, April 19, 2010
మనం
మనం ద్వేషించే గుణాలన్నీ మనలోనే ఉంటే
ఇంకేం చేయగలం ?
మనం విమర్శించే విషయాలన్నీ మనలోనే ఉంటే
ఇంకేం మాట్లాడగలం ?
మనం సొంతమనుకున్న విషయాలన్నీ మనం దొంగలించినవని తెలిస్తే ,
మరెవర్ని శిక్షించగలం ?
మనం పాటించనివే మరొకరికి ప్రవచిస్తున్నామని తెలిస్తే ,
మరేం చెప్పగలం ?
మనమేదో చేయాలని బయటకు వెళితే , ముందు మారాల్సింది మనమేనని తెలిస్తే,
మరెక్కడికి పొగలం ?
ఓ మూలన మౌనంగా కుర్చోనడం తప్ప !

Subscribe to:
Posts (Atom)