Tuesday, November 29, 2011


నా దారి




నేను దారి తప్పి నడుస్తున్నానా ?



నిజమా ?
అయితే నేను చేరాల్సింది ఎక్కడికి ?
చేరాల్సింది ఎక్కడికో తెలిస్తేనే కదా దారి తప్పానా లేదా తెలిసేది ?

ఈ దారి వద్దన్నా నడిపిస్తోనే ఉంది ! ఎంతకీ ఆగని దారిలా ఉంది !

కానీ ప్రతి అడుగు తప్పటడుగులానే ఉంది !
ఎక్కడికో వెళ్తున్నట్టే ఉంది , తప్పుతప్పుగా !

చేరాల్సిన చోటేదో తెలియక
నడక సాగుతోనే ఉంది !