Saturday, October 10, 2009

మైదానం

నేను నా గీత దాటి నీ మైదానంలోకి

వచ్చానని సంబరపడ్డాను !

కానీ నువ్వన్నావ్ !

"నీ గీతఐతే దాటావేమో ! కానీ నా మైదానంలో నువ్వింకా అడుగుపెట్టలేదు " .


నిన్ను చేరాలనే నా గీత దాటినవాణ్ని.

తిరిగి పోలేను.

ఎంతకీ కానరాని నీ గీతని దాటడానికి ,

నిన్ను చేరడానికి,

నేనంతటా వెతుకుతున్నాను.

ప్రతీ మైదానంలో అడుగుపెడుతున్నాను.

కానీ, నీ గీతేమిటో నాకంతుబట్టడంలేదు.

అలసి పోయి కూలబడ్డాను ఇలా ఈ మైదానాల్లో,

నువ్వు నీ గీత దాటి నన్ను చేరుతావని ఎదురుచూస్తూ !





1 comment:

  1. how rare such journeys are, yet how similar are the feelings one goes thru in taking such journeys! be adventerous! you have company beyond and across ur point in existence!

    ReplyDelete